Sri Veerabrahmendra Swami Kalagnanam Highlights

Veerabrahmaఈ సర్వజగత్తుకు సృష్టికర్త అయిన విశ్వకర్మను వేదపితగాను, అయన భార్య గాయత్రీదేవిని వేదమాతగాను వేదములు కీర్తీంచినవి. వారి పుత్రులైన (1)మను బ్రహ్మ (శివుడు) (2)మయ బ్రహ్మ (విష్ణువు) (3)త్వష్ట్ర బ్రహ్మ (బ్రహ్మ) (4)శిల్పి బ్రహ్మ (ఇంద్రుడు) (5)విశ్వజ్ఞ బ్రహ్మ (సూర్యడు) లు పంచబ్రహ్మలుగా పేరుగాంచినారు. వీరిలో మయబ్రహ్మమైన విష్ణువు భూమండలమును పాపులనుండి రక్షించుటకై అనేక అవతారములు యైత్తినాడు. వాటిలో పది అవతారములు ప్రాముఖ్యతగాంచినవి. దశావాతారములలో చివరిదైన కల్కి లేద వీరభోగవసంతరాయలుగా అవతరించుటకు ముందు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేండ్డ్ర స్వామిగా అవతరించినారు. తెలుగువారిలో బ్రహ్మంగారి గురించి, వారు వ్రాసిన కాలజ్ఞానాన్ని గురించి తెలియనివారు అరుదు. ఎక్కడ ఏ వింత జరిగినా ప్రజలు బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతున్నదని అనుకోవడం అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞ్నంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ క్రింది వరుసక్రమంలో జరుగవచ్చు.

1) శ్రీ వీరభోగవసంతరాయల వారు 'విశ్వావసు' నామ సంవత్సరం (1965-1966) లో జన్మించి అశ్వత్ధామ, దత్తాత్రేయుల వారు, శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామివారు,శ్రీ ఆచార్య నాగార్జునుల వారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామివారు, తదితర సిథ్థపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుడిని ప్రార్ధించి వారిచే 'దేవదత్త' మనే గుఱ్ఱమును, 'శుక' మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, కార్ముకము అనే విల్లును, అక్షయ తూణీరములును, పాశుపత అస్త్రమును (22-11-2007 నాడు), ఆశీస్సులను పొంది, తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం శ్రీ వీరభోగ వసంతరాయలవారి అధీనంలో ఉంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి.

2) ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.

3) తేది 13.04.2000 నాడు శ్రీ వీరభోగ వసంతరాయలు వారు విజయవాడలో ఇన్ద్రకీలాద్రిపై యున్న కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. (బహుశా ఆ సం.లోనే వివాహము అయివుంటుంది).

4) అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.

5) సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.

6) తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు.

7) కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం,నీటికోసం, మతకల్లోలాలవల్ల).

8) తేది.26-12-2011 న శ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులౌతారు.

9) మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.(మాయన్ కేలండర్ వ్రాసినవారు మయబ్రహ్మ వారసులని ప్రతీతి).

10) హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర 'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు.

11) కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.

12) శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.

13) ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.

14) నందన(2012-2013)లో శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును. శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడును. శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి మేకపోతువలె అరచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకెవేసి కాలుదువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును.

15) విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.

16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.

17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.

18.గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.

19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.

20) తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.

21.సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.

22) యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

23) క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి యుధ్ధం. ఢిల్లీ పై బాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం లో నెల్లూరు నీటమయమౌతుంది.

24) కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.

25) కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.

26) భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.

27) కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.

28) నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.

29) బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగక పోవును.

30) ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.

31) కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.

32) భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.

33) ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)

34) మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.

35) 'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).

36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.

37) తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది.

38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.

39) ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.

40) కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.

41) ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.

42) తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి నేల మట్టమౌతుంది.

43) క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.

44) పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.

45) తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.

46) తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.

47) గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.

48) శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.

49) అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.

50) క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.

51) మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.

52) వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.

53) ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.

54) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.

55) నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.

56) ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.

57) భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).

58) వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.

59) పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.

60) తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.

61)  జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.

62) ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.

63) తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి శ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.

Posted by :Admin

Related Posts

 • Sri Thallapaka Annamacharya, Thallapaka Sri Thallapaka Annamacharya, Thallapaka

  The 600th Annamacharya Jayanthi celebrations were completed in Rajampet on 22nd May 2008. The Chief Minister of Andhra Pradesh, Dr. Y.S. Rajasekhara Reddy unveiled the 108 feet statue of Sri Thallapaka Annamacharya located on Tirupati-Kadapa bypass road in Rajampet on May 22nd.

 • Krishna Pushkaram Ghats List Krishna Pushkaram Ghats List

  krishna pushkaram AP, Telangana Krishna Pushkara Ghats Places.

 • Instructions on how to write Raama Naamam or Likhita Japa Instructions on how to write Raama Naamam or Likhita Japa

  "Ra" is the agni beejam and "Ma" is the amrita beejam. "Ra" indicates the destroyer of ignorance in humans while "Ma" indicates the praana vaayu being nourished. Hence, the great composer, Thyagaraja Swami, a huge devotee of Lord Ram, often stressed on these beejams in his compositions.

 • Story Behind Sri Rama Navami Story Behind Sri Rama Navami

  Rama is the in-dweller in every body. He is the Source of Bliss (Atma-Rama) in every individual. His blessing, surging from that inner spring, confers peace and bliss. He is the very embodiment of Dharma, of all the codes of morality that hold mankind together in love and unity

 • significance ugadi / Gudipadawa significance ugadi / Gudipadawa

  The term Ugadi has its origin in the Sanskrit word Yugadi, that means starting of a new Yuga or period. This traditional festival is usually celebrated in the second half of March or in early April. People from all over Karnataka celebrate this festival with much enthusiasm and gaiety.The significance of Ugadi stems from mythological times when Lord Brahma, the creator of the universe, began a series of wonderful creations, including that of the earth and all the life forms that live in it. The festival of Ugadi is celebrated to acknowledge that very day on which Lord Brahma started with the task.

 • Mauni Amavasya Mauni Amavasya

  According to North Indian calendar, Mauni Amavasya comes in the Magha month and also known as Maghi Amavasya. This Amavasya is also known as Mauna Amavasya and Mauni Amavas

 • Shani Trayodashi Shani Trayodashi

  Shani Trayodashi is the Trayodashi which falls on a Saturday known as Shani Trayodasi, Shani Jayanti or Shani Pradosham. Shani Jayanti Festival Puja Vidhi, Vrat Katha, Mantra Japa and Yagna Puja

 • Masik Kalashtami Masik Kalashtami

  Kalashtami, which is also known as Kala Ashtami, is observed every month during Ashtami Tithi of Krishna Paksha. Devotees of Lord Bhairav keep fast and worship Him on all Kalashtami days in the year.

 • Kuja - Manglik - Mangal Dosha Effect and Remedies Kuja - Manglik - Mangal Dosha Effect and Remedies

  A simple survey shows that as many as 90% of the people in the Universe will be under the influence of Kuja Dosha. Every one of us, at one time or the other, will hear about Kuja. The word is more prominently heard when horoscopes of the bride and bridegroom are studied before their marriage.

 • Lord Ganesha Sankashti or Sankatahara Chaturthi Pooja Procedure And Dates In 2016 Lord Ganesha Sankashti or Sankatahara Chaturthi Pooja Procedure And Dates In 2016

  Sankashti Chaturthi or Ganesh Sankatahara Chaturti, is dedicated to Hindu God Ganesh. Sankashti Chaturthi January 2016 date is January 27, Wednesday and the Chandrodaya or Moon rise time is 8:57 PM (IST).

Latest Posts

 • Temples
 • Sacred Places
 • Articles
 • Pancha Sabhai Sthalams / Sthalangal
  Pancha Sabhai Sthalangal refers to the temples of Lord Nataraja, a form of Lord Shiva where he performed the Cosmic Dance. Panc..
 • Pancha Bhoota Stalas
  Pancha Bhoota Stalam or Pancha Bhoota Stala refers to the five Shiva temples, dedicated to Shiva, the most powerful Hindu god a..
 • 18 Shakti Peethas / Asta Dasa Shakti Peethas
  Astadasha Shakthi Peetas Lord Brahma performed a yagna to please Shakti and Shiva. Goddess Shakti emerged, separating from Shiv..
 • Navagaraha Sthala or Temple
  Navagraha Suriyan (Sun), Chandran (Moon), Chevvai (Mars), Budha (Mercury), Guru (jupiter), Sukra (Venus), Sani (Saturn), Rahu (..

Gallery

 • Siddeshwara Swamy Temple, Warangal
 • 10 Unique things you should do in Kolhapur
 • Sri Seetha Ramachandra Swamy Vaari Devasthanams, Bhadrachalam, Khammam, Telangana
 • Sri Brahmaramba Mallikarjuna Swamy Devasthanam, Srisailam, Kurnool, Andhra Pradesh
 • Maisigandi Maisamma Temple Kadthal, Mahabubnagar, Telangana
 • Arulmigu Jambukeswarar Akhilandeswari Temple, Thiruvanaikaval, Trichy, Tamilnadu
 • Sri Lakshmi Tirupatamma Devasthanam, Penuganchiprolu, Andhra Pradesh
 • Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam, Mopidevi, Andhra Pradesh
 • Sri Durga Malleswara Swamy Varla Devastanams, Vijayawada
 • Sree Bhadrakali Devasthanam, Warangal
 • Sri Lakshmi Ganapathy Temple, Biccavolu
 • Ashok Vatika
 • The Lords Own Country, Dwarka
 • Simhachalam Temple
 • Sree Padmanabhaswamy Temple